Sky: ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది

ABN , First Publish Date - 2023-09-09T18:39:34+05:30 IST

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో.. వేలర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్‌పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే..’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Sky: ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది
Sky Movie Still

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో.. వేలర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్‌పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్కై’ (Sky). ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే..’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల చివరి దశకు చేరుకుంది. (Sky Movie First Look Out)


Sky.jpg

ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే.. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడిని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా ‘స్కై’ చిత్రం కథాంశమని.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల వివరాలను తెలియజేస్తామని అన్నారు. (Sky Movie Storyline)


ఇవి కూడా చదవండి:

============================

*Gopichand32: గోపీచంద్ 32వ చిత్రం ఆ దర్శకుడితోనే.. ఓపెనింగ్ కూడా పూర్తయింది

*********************************

*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

*********************************

*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

**********************************

*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

**********************************

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

Updated Date - 2023-09-09T18:39:34+05:30 IST