విడుదల తేది ఖరారు

ABN , First Publish Date - 2023-09-07T02:16:38+05:30 IST

రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. ‘ది ఎటాకర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది.

విడుదల తేది ఖరారు

రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కంద’. ‘ది ఎటాకర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. బుధవారం నిర్మాణసంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ రిలీజ్‌ డేట్‌ను వెల్లడించింది. ఈ నెల 28న ‘స్కంద’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రామ్‌, కథానాయిక శ్రీలీల జోడీ రొమాంటిక్‌గా ఆకట్టుకుంది. వారాంతంతో పాటు గాంధీ జయంతి, దసరా సెలవులు కలిసొచ్చేలా యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసింది. రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌, గౌతిమి, ప్రిన్స్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-07T02:18:12+05:30 IST