షికారు పోదమా..!
ABN , First Publish Date - 2023-09-24T02:16:19+05:30 IST
సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమా’. సుభాష్ చంద్ర దర్శకుడు. ప్రవీణ్ నంబారు, సృజన్ ఎర్రబోలు నిర్మాతలు...

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమా’. సుభాష్ చంద్ర దర్శకుడు. ప్రవీణ్ నంబారు, సృజన్ ఎర్రబోలు నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో పోస్టర్‌ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన క్రిష్ మాట్లాడుతూ ‘‘విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చింది. సంతోష్ శోభన్ చాలా ఈజ్ ఉన్న నటుడు. తనకి మంచి హిట్ దొరకాల’’ని ఆకాంక్షించారు. ‘‘ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఓ చక్కటి ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ఇండియా మొత్తం చుట్టొచ్చిన అనుభూతి కలుగుతుంద’’న్నారు దర్శకుడు. ‘‘సింపుల్ కథ ఇది. చాలా హాయిగా ఉంటుంది. కొత్తవాళ్లు చాలామంది ఈ టీమ్‌లో భాగం పంచుకొన్నార’’ని సంతోష్ చెప్పారు.