శాకుంతలం మరోసారి వాయిదా
ABN , First Publish Date - 2023-02-08T01:20:00+05:30 IST
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదల మరోసారి వాయిదాపడింది. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది...

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదల మరోసారి వాయిదాపడింది. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీకి ‘శాకుంతలం’ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ మంగళవారం ప్రకటించింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. గతంలో కూడా పలుమార్లు ‘శాకుంతలం’ విడుదల వాయిదా పడింది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది. పౌరాణిక గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత శకుంతల పాత్ర పోషించారు. మలయాళ నటుడు దేవ్‌మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. మోహన్‌బాబు దుర్వాస మహర్షిగా కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.