సీనియర్ స్టంట్ మాస్టర్ జూడో రత్నం మృతి
ABN , First Publish Date - 2023-01-27T04:46:06+05:30 IST
సీనియర్ స్టంట్ మాస్టర్ జూడో కేకే రత్నం (93) గురువారం మృతి చెందారు. 1970 - 80 మధ్య కాలంలో . ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్.టి.ఆర్, కృష్ణ...
సీనియర్ స్టంట్ మాస్టర్ జూడో కేకే రత్నం (93) గురువారం మృతి చెందారు. 1970 - 80 మధ్య కాలంలో . ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్.టి.ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, రాజ్‌కుమార్, ప్రేమ్ నజీర్, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, విజయ్, అజిత్ వంటి అనేక మంది హీరోల చిత్రాలకు ఈయన ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 1200 చిత్రాలకు పనిచేశారు. తన కెరీర్‌లో 63 మంది హీరోలకు పోరాట దృశ్యాలు చిత్రీకరించినందుకుగాను గిన్నిస్ రికారు కూడా ్డ సాధించారు. రజనీకాంత్‌తో ఆయన ఏకంగా 46 చిత్రాలకు ఫైట్ మాస్టరుగా పనిచేశారు. ఆయన చివరగా ఫైట్‌మాస్టరుగా పనిచేసిన చిత్రం ‘పాండ్యన్’ 1992లో విడుదలైంది. కేవలం ఫైట్ మాస్టరుగానే కాకుండా, ‘తామరైకులం’, ‘కొంజుం కుమరి2’, ‘పోకిరి రాజా’, ‘తలైనగరం’ వంటి చిత్రాల్లో నటించారు. ఈయనకు 2019లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యం కారణంగా ఆయన గురువారం తన సొంతూరైన వేలూరు జిల్లాలోని గుడియాత్తంలో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయానికి చెన్నైకు తీసుకొచ్చి స్థానిక వడపళనిలోని సన్నిధి వీధిలో ఉన్న స్టంట్ యూనియన్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత గుడియాత్తంకు తీసుకెళ్ళి అంత్యక్రియలు పూర్తిచేస్తారు. జూడో రత్నం మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆంధ్రజ్యోతి, చెన్నై