Seetaram Sitralu Hero: అదే నా కోరిక అంటోన్న ‘సీతారాం సిత్రాలు’ హీరో

ABN , First Publish Date - 2023-07-23T19:01:36+05:30 IST

‘నువ్వు గెలవనంత వరకు ఏమీ చెప్పినా.. అది చెత్తె. ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త చెప్పినా.. అది చరిత్రే’’ అనే కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతోన్న ‘సీతారాం సిత్రాలు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో థియేటర్స్‌లో విడుదల కానుంది.

Seetaram Sitralu Hero: అదే నా కోరిక అంటోన్న ‘సీతారాం సిత్రాలు’ హీరో
Seetaram Sitralu Hero Lakshman

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారాం సిత్రాలు’ (Seetaram Sitralu). లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘సీతారాం సిత్రాలు’ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకులు అశోక్ చేతుల మీదుగా జరిగాయి. అనంతరం చిత్ర టైటిల్ లోగోను సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు.

‘‘నువ్వు గెలవనంత వరకు ఏమీ చెప్పినా.. అది చెత్తె. ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త చెప్పినా.. అది చరిత్రే’’ అనే కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతోన్న ‘సీతారాం సిత్రాలు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో లక్ష్మణ్ (Lakshman) మాట్లాడుతూ.. ‘సీతారం సిత్రాలు’ కాన్సెఫ్ట్ చాలా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే కాదు.. ఇకపై కూడా కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది. అదే నా కోరిక. ‘సీతారాం సిత్రాలు’ అందరినీ అలరించే ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. త్వరలో మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

**************************************

*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?

**************************************

Updated Date - 2023-07-23T19:04:24+05:30 IST