Samantha: ‘కీ డివోర్స్ స్టాటిస్టిక్స్’తో ఏం చెప్పిందంటే!
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:18 AM
టాలీవుడ్ అగ్ర నటి సమంత అభిమానుల కోసం కుదిరిన ప్రతిసారీ సమయం కేటాయిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా చాటింగ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు నెటిజన్లు ఆకతాయి ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి సమయంలో సహనాన్ని కోల్పోతే ధీటుగా సమాధానం ఇస్తారు సామ్
టాలీవుడ్ అగ్ర నటి సమంత (Samantha) అభిమానుల కోసం కుదిరిన ప్రతిసారీ సమయం కేటాయిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా చాటింగ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు నెటిజన్లు ఆకతాయి ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి సమయంలో సహనాన్ని కోల్పోతే ధీటుగా సమాధానం ఇస్తారు సామ్. తాజాగా అలాంటి ఘటనే సామ్‌కు ఎదురైంది.. ‘మళ్లీ పెళ్లిపై మీరెందుకు ఆలోచించకూడదు?’ అని తాజాగా ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె స్పందించారు. విడాకులకు సంబంధించిన లెక్కల్ని చూపిస్తూ.. ఈ లెక్కల ప్రకారం అది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొని దానికి స్మైలీ ఎమోజీ జోడించారు. ‘కీ డివోర్స్ స్టాటిస్టిక్స్’ పేరుతో సమంత షేర్ చేసిన ఇమేజ్‌లో.. 2023లో.. మొదటి పెళ్లి విడాకులు 50 శాతం ఉండగా, రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. స్ర్తీ, పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్ ఇలానే ఉందట’’ అని పేర్కొన్నారు. మరో నెటిజన మీరు దేవుడిని నమ్ముతారా? అంటే నమ్ముతానని సమంత చెప్పారు. మనం గురించి మనకు బాగా తెలుసని అనుకుంటాం. అదే సమయంలో కొన్ని సర్‌ప్రైజ్‌లు జరుగుతుంటాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. అవును.. కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. ఆరెండు ఉంటేనేగా మన జీవితం యునీక్‌గా ముందుకెళ్తుంది’ అని చెప్పారు. రానున్న సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
ఇటీవల ‘ఖుషి’ (Kushi) చిత్రంతో అలరించింది సమంత. త్వరలో ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనుంది. వరుణ్ ధావన కీలక పాత్రధారి. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇప్పటి దాకా హీరోయినగా కొనసాగిని సమంత ఇటీవల నిర్మాతగా మారారు. ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.