Sachin Tendulkar: మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి
ABN , First Publish Date - 2023-09-05T19:09:50+05:30 IST
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మంగళవారం ముంబైలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా ‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం (Muttiah Muralitharan Biopic) ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఎంఎస్ శ్రీపతి (MS Sripathy) స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఈ చిత్రాన్ని సమర్పిస్తూ.. దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మంగళవారం ముంబైలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ముఖ్య అతిథిగా ‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ట్రైలర్ విడుదల అనంతరం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మాట్లాడుతూ.. మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. నేను 1993లో తొలిసారి మురళీధరన్ (Muttiah Muralitharan)ని కలిశా. అప్పటి నుంచి మా మధ్య స్నేహం అలాగే ఉంది. లాస్ట్ మంత్ యూనిసెఫ్ వర్క్ మీద నేను శ్రీలంక వెళ్ళా. అప్పుడు మురళీధరన్‌కి మెసేజ్ చేశా... ‘నేను మీ సిటీలో ఉన్నాను’ అని! ‘అక్కడ ఏం చేస్తున్నావ్. నేను భారత్‌లో ఉన్నాను’ అని రిప్లై ఇచ్చాడు. తర్వాత బయోపిక్ గురించి చెప్పాడు. ఈ ఈవెంట్‌కి రాగలవా? అని అడిగాడు. మురళీధరన్ ఎంతో సాధించాడు. అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. (Sachin about Muttiah Muralitharan)
ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు. పిచ్ ఎలా ఉన్నా సరే మురళీధరన్ బంతిని టర్న్ చేయగలడు. అతడిని ఎలా ఎదుర్కోవాలని మేం మీటింగ్స్‌లో డిస్కస్ చేసేవాళ్ళం. హర్భజన్ ఒకసారి చెప్పాడు... అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి దూస్రా వేయడానికి ముందు 18 నెలలు మురళీధరన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడట. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10,500 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తీసుకుంటే మరో 10 వేల ఓవర్లు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
============================
*Harish Shankar: ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..!
*************************************
*Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!
************************************
*Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు
*************************************