Rudram Kota: ‘రుద్రంకోట‌’ మ్యాటరేంటో తెలిసేది అప్పుడే..

ABN , First Publish Date - 2023-07-26T20:38:33+05:30 IST

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘రుద్రంకోట‌’. ఏఆర్‌కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్ట్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Rudram Kota: ‘రుద్రంకోట‌’ మ్యాటరేంటో తెలిసేది అప్పుడే..
Rudram Kota Movie Stills

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత (Jayalalitha) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘రుద్రంకోట‌’ (Rudram Kota). ఏఆర్‌కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన (Ramu Kona) ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. ఆగ‌స్ట్ నెల‌లో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌ చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ వెల్లడించారు.


ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి మాట్లాడుతూ.. ‘‘శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దవాడైన ఓ యువకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి. సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత‌గారు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. (Rudram Kota Release Details)

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కోటిగారు మా చిత్రానికి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ ప్ర‌ముఖులు యుబైఏ స‌ర్టిఫికెట్‌తో పాటు సినిమా బావుందంటూ ప్ర‌శంసించారు. మా సినిమా న‌చ్చ‌డంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. ఆగ‌స్ట్‌లో సినిమాను విడుద‌ల చేయ‌నున్నాం’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bholaa Shankar: గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్.. టైమింగ్ అదిరింది

**************************************

*Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..

**************************************

*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..

**************************************

*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?

**************************************

*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్

**************************************

Updated Date - 2023-07-26T20:39:44+05:30 IST