Jayalalitha: ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన సీనియర్ నటి జయలలిత

ABN , First Publish Date - 2023-09-25T18:56:23+05:30 IST

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కురాలిగా వ్యవహరించడంతో పాటు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ చిత్రం ‘రుద్రంకోట‌’. ఏఆర్‌కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో.. అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీల్‌, విభీష‌, అలేఖ్య‌ హీరోహీరోయిన్లుగా న‌టించారు. సెప్టెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

Jayalalitha: ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన సీనియర్ నటి జయలలిత
Rudram Kota Movie Team

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత (Jayalalitha) స‌మ‌ర్ప‌కురాలిగా వ్యవహరించడంతో పాటు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ చిత్రం ‘రుద్రంకోట‌’ (Rudram Kota). ఏఆర్‌కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన (Ramu Kona) ద‌ర్శ‌క‌త్వంలో.. అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి (Anil Arka Kandavalli) ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీల్‌, విభీష‌, అలేఖ్య‌ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రం ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా 200కు పైగా థియేటర్లలో విడుద‌లై పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా సోమవారం చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. సినిమాను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ సీనియర్ నటి జయలలిత చెప్పుకొచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. మా ‘రుద్రంకోట‌’ చిత్రాన్ని ఇంత పెద్ద‌ స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కులంద‌రికీ మా టీమ్ అంద‌రి త‌రఫున ధ‌న్య‌వాదాలు. అలాగే మీడియా వారు కూడా మా చిత్రానికి మంచి ప‌బ్లిసిటీ ఇచ్చి ప‌బ్లిక్‌లోకి తీసుకెళ్లారు. వారికి కూడా థ్యాంక్స్. విడుద‌లైన అన్ని ఏరియాల నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు సంగీతం, ద‌ర్శ‌క‌త్వం, న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్, నా పాత్ర ఇలా ప్ర‌తి అంశం గురించి ఆడియ‌న్స్ మాట్లాడుతున్నారు. చూడ‌ని వారు మా చిత్రాన్ని చూసి ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నానని అన్నారు. (Rudram Kota Movie Success Meet)


Jayalalitha.jpg

ద‌ర్శ‌కుడు రాము కోన మాట్లాడుతూ.. మా చిత్రాన్ని ప‌బ్లిక్‌లోకి తీసుకెళ్లి, విడుదల తర్వాత మంచి రివ్యూస్ ఇచ్చి స‌పోర్ట్ చేస్తోన్న పాత్రికేయుల‌కు ధ‌న్య‌వాదాలు. జ‌య‌లలితగారు ఈ సినిమా విషయంలో ఎంతో స‌పోర్ట్ చేశారు. మా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఆ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ఈ రోజు మాకు ద‌క్కింది. ఇటీవ‌ల గుంటూరు‌లో కొన్ని థియేట‌ర్స్ సంద‌ర్శించాం. చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. బి.గోపాల్ గారు, కాట్ర‌గ‌డ్డగారు మా చిత్రాన్ని మెచ్చుకుని నాకు స‌న్మానం చేయ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నానని అన్నారు.

హీరోయిన్ విభీష మాట్లాడుతూ.. ఒక హిట్ సినిమాలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని, ఈ సినిమా విషయంలో జ‌య‌లలితగారి స‌పోర్ట్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిదని తెలుపగా.. హీరో అనిల్ మాట్లాడుతూ.. కంటెంట్ ఉంటే కొత్త‌వాళ్ల‌నైనా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు అన‌డానికి మా సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. విడుద‌లైన అన్ని ఏరియాల నుంచి సినిమాకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌రూ చూసి ఇంకా పెద్ద స‌క్సెస్ ఇస్తార‌ని కోరుకుంటున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

Updated Date - 2023-09-25T18:58:17+05:30 IST