హాస్టల్ డేస్ గుర్తుకు తెస్తుంది
ABN , First Publish Date - 2023-08-22T00:25:57+05:30 IST
కన్నడలో విజయవంతమైన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ సంస్థలు ఈనెల 26న విడుదల చేస్తున్నాయి...
కన్నడలో విజయవంతమైన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ సంస్థలు ఈనెల 26న విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘‘కన్నడలో ఈ చిత్రం చాలా పెద్ద విజయాన్ని అందుకొంది. ప్రతి ఒక్కరి హాస్టల్ డేస్ గుర్తు తెచ్చే సినిమా ఇది. తెలుగు కోసం కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేశాం. రష్మి గౌతమ్, తరుణ్ భాస్కర్‌లపై ప్రత్యేకంగా కొన్ని సీన్లు తీశాం. ఆ పాత్రలు ఆకట్టుకొంటాయి. డబ్బింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. తెలుగు నేటివిటీ కనిపిస్తుంది. ఓ తెలుగు సినిమా చూసిన ఫీలింగే కలుగుతు ద’’న్నారు.