RAM: ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’ నుంచి పవర్ ఫుల్ పాటొచ్చింది

ABN , Publish Date - Dec 22 , 2023 | 07:20 PM

రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశభక్తి గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.

RAM: ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’ నుంచి పవర్ ఫుల్ పాటొచ్చింది
Rapid Action Mission Movie Still

నిజ జీవిత కథలను ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడూ అభిమానిస్తుంటారు. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి స్టోరీలపైనే మక్కువ పెరుగుతోంది. ఇప్పుడలాంటి రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) (Rapid Action Mission) అనే చిత్రం రాబోతోంది. ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో బ్రేవ్ హార్ట్స్ (Brave Hearts Lyrical Song) అంటూ సాగే ఓ దేశభక్తి గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ మంచి స్పందనను రాబట్టుకున్నట్లే.. తాజాగా విడుదలైన దేశభక్తి గీతం కూడా శ్రోతలను ఆకర్షిస్తోంది. ఈ పాటను ఆస్కార్ అవార్డ్ ‘నాటు నాటు’ పాటను ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పాడగా.. రాము కుమార్ ఏఎస్‌కే (Ramu Kumar A S K) సాహిత్యం అందించారు. ఆశ్రిత్ అయ్యంగార్ (Aasrith Ayyangar) బాణీ ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని తట్టిలేపేలా ఉంది.


Breave-Hearts.jpg

దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల (Surya Ayyalasomyajula) హీరోగా పరిచయం కాబోతున్నారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదలకు సంబంధించిన విషయాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్.. షరతులు ఏంటంటే?

********************************

*Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?

*******************************

*పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!

*********************************

Updated Date - Dec 22 , 2023 | 07:20 PM