Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..

ABN , First Publish Date - 2023-10-18T20:49:38+05:30 IST

తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Rana Daggubati: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి దర్శకుడు ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నా..
Keedaa Cola Trailer Launch Event

తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’తో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుని దర్శకుడిగా తన ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker). ఇప్పుడాయన తన మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ (Keedaa Cola)తో వస్తున్నారు. బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లను అందించిన దర్శకుడు న్యూ కమ్మర్స్‌తో కలసి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ప్రధాన పాత్రలో ఒక యూనిక్ ఎంటర్‌టైనర్‌ని రెడీ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌.. ఈ సినిమా హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. బుధవారం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati) థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

తరుణ్ భాస్కర్ కథ-కథనంలో ప్రత్యేకమైన శైలి వుంటుందనే విషయం తెలియంది కాదు. ట్రైలర్ కట్ చేయడంలో కూడా తన మార్క్ చూపించారు. ‘కీడా కోలా’ ట్రైలర్ ఒక క్రేజీ రైడ్. 9 ప్రధాన పాత్రలు వున్న ఈ కథ కీడా, బార్బీ చుట్టూ తిరుగుతుంది. కీడా చుట్టూ కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ అది రివీల్ చేయలేదు, బార్బీ వాల్యూ మిలియన్లు. మిగిలిన ప్రధాన పాత్రలు హిలేరియస్ క్రేజీ ఫన్ రైడ్‌ని ప్రజెంట్ చేశాయి. వరదరాజులు తాతగా బ్రహ్మానందం, వాస్తుగా చైతన్యరావు, లంచంగా రాగ్ మయూర్, నాయుడుగా తరుణ్, సికిందర్‌గా విష్ణు, జీవన్‌గా జీవన్‌కుమార్, సీఈవోగా రవీంద్ర విజయ్, షాట్స్‌గా రఘురామ్ అందరూ సీరియస్‌గా కనిపించినా వారి యాక్ట్స్ మాత్రం హ్యుమర్‌ని పండించాయి.. అదే కీడా కోలాలోని బ్యూటీ. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ ‘కీడా కోలా’ విజి సైన్మ మొదటి ఫీచర్- ఫిల్మ్‌గా రూపొందింది. ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తుండగా.. ఈ సినిమాని నవంబర్ 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Keedaa Cola Trailer Talk)


Rana.jpg

ట్రైలర్ విడుదల అనంతరం రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. తాము అనుకున్న కథని బలంగా నమ్మి, కథకు కథనానికి కట్టుబడి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా వుంటారు. తరుణ్ భాస్కర్ కూడా అలాంటి అరుదైన దర్శకుడు. ఒరిజినల్ సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ లాంటి ఫిల్మ్ మేకర్ తెలుగు పరిశ్రమలో వుండటం ఒక గౌరవంగా భావిస్తాను. కీడా కోలా చిత్రాన్ని తరుణ్ చూపించినపుడు చాలా నవ్వుకున్నాను. ప్రేక్షకుల కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. తరుణ్ సినిమాల్లో ఎప్పుడూ చూడని కొత్త నటీనటులని ఇందులో చాలా కొత్తగా చూస్తున్నాం. నవంబర్ 3న సినిమా వస్తోంది. సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు. (Keedaa Cola Trailer Launched)

దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. క్రైమ్ కామెడీ నాకు చాలా ఇష్టమైన జోనర్. ఈ జోనర్‌లో సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. అయితే మొదటి సినిమా ఫ్యామిలీతో వెళ్ళడానికి, అలాగే బడ్జెట్ పరంగా వీలుగా ఉంటుందని ‘పెళ్లి చూపులు’, తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలు చేయడం జరిగింది. ‘కీడా కోలా’ కథ రాస్తున్నపుడు ఈ జోనర్ ఎంత కష్టమైనదో అర్థమైంది. కథ అద్భుతంగా వచ్చింది. చిత్రీకరణ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇందులో చాలా కొత్తదనం వుంటుంది. సినిమా అంతా వినూత్నంగా వుంటుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైయింది చిత్రాల విషయంలో కొంచెం నెర్వస్ నెస్ వుండేది. కానీ ఈ చిత్రం విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. ఎడిట్ పదిసార్లు చూశాను. చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఫ్యామిలీ, స్నేహితులతో కలసి వెళ్ళండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*VK Naresh: చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం

**********************************

*Telusu Kada: నాని క్లాప్‌తో సిద్దు జొన్నలగడ్డ సినిమా మొదలైంది.. తెలుసు కదా!

**********************************

*Leo: వేకువజామున 4గంటల ఆటకు హైకోర్టు నో.. కారణమిదే!

**************************************

*Rajinikanth: విజయ్‌ ‘లియో’ ఘన విజయం సాధించాలి

**************************************

Updated Date - 2023-10-18T20:49:38+05:30 IST