Raa Raja: ఫస్ట్ లుక్ వదిలారు కానీ.. ఆర్టిస్ట్‌ల పేర్లు చెప్పరట..!

ABN , First Publish Date - 2023-10-07T19:23:04+05:30 IST

ఒక ఆసక్తికరమైన హారర్ జానర్ చిత్రంతో శ్రీ పద్మిని సినిమాస్ అనే బ్యానర్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. పోస్టర్‌లో పాత్రలు కనిపించనప్పటికీ ఈ చిత్ర ప్రీలుక్ ఇటీవల పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాకు ‘రా..రాజా’ అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులోనూ పాత్రల ముఖాలను కనిపించడం లేదు.

Raa Raja: ఫస్ట్ లుక్ వదిలారు కానీ.. ఆర్టిస్ట్‌ల పేర్లు చెప్పరట..!
Raa Raja Movie First Look

ఒక ఆసక్తికరమైన హారర్ జానర్ చిత్రంతో శ్రీ పద్మిని సినిమాస్ (Sri Padmini Cinemas) అనే బ్యానర్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. పోస్టర్‌లో పాత్రలు కనిపించనప్పటికీ ఈ చిత్రం ప్రీలుక్ ఇటీవల పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాకు ‘రా..రాజా’ (Raa Raja) అనే టైటిల్‌తో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో కూడా హీరోహీరోయిన్ ఎవరో తెలియనీయకుండా చేశారు. ఆకట్టుకునే కథనం మరియు స్క్రీన్‌ప్లేతో స్క్రిప్ట్‌లో చాలా మలుపులు ఉన్నందున కాస్టింగ్ సమాచారాన్ని సస్పెన్స్‌లో ఉంచడానికి మొత్తం చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

బి.ఎస్ ప్రసాద్ (BS Prasad) ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు. అతి త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందే.. ఈ సినిమాలో ఉన్న ఆకర్షణీయమైన అంశాలను తెలియజేస్తామని దర్శకనిర్మాత బి.ఎస్ ప్రసాద్ చెబుతున్నారు. (Raa Raja First Look Out)


Horror-Film.jpg

సినిమా అవుట్‌పుట్‌పై మొత్తం చిత్ర తారాగణం మరియు సిబ్బంది నమ్మకంగా ఉన్నామని, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు అతి త్వరలో..


ఇవి కూడా చదవండి:

============================

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

*Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్

********************************

*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

********************************

*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

********************************

Updated Date - 2023-10-07T19:23:04+05:30 IST