పోలీసువారి హెచ్చరిక ఏమిటంటే..;?
ABN , First Publish Date - 2023-11-18T00:31:07+05:30 IST
అభ్యుదయ చిత్రాలను రూపొందించే దర్శకుడు బాబ్జీ తాజా చిత్రం ‘పోలీ్‌సవారి హెచ్చరిక’. బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ విజయదశమి రోజున మొదలై శరవేగంతో జరుగుతోంది.

అభ్యుదయ చిత్రాలను రూపొందించే దర్శకుడు బాబ్జీ తాజా చిత్రం ‘పోలీ్‌సవారి హెచ్చరిక’. బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ విజయదశమి రోజున మొదలై శరవేగంతో జరుగుతోంది. హైదరాబాద్, ఘటకేసర్, ఘనాపూర్, షామీర్ పేట తదితర ప్రాంతాల్లో ఇంతవరకూ జరిగిన షూటింగ్‌తో యాభై శాతం వర్క్ పూర్తయింది. కీలక సన్నివేశాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్లు చిత్రీకరించిసట్లు దర్శకుడు బాబ్జీ చెప్పారు. డిసెంబర్ మొదటి వారానికల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుందన్నారు. ‘మన కళ్లముందుతిరిగే అనాథలు, అభాగ్యుల విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే వారు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకుని సమాజాన్ని నాశనం చేసే నేరస్తులుగా మారే ప్రమాదం ఉందనే సందేశంతో కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని చెప్పారు బాబ్జీ. భారత సైన్యంలో పని చేసిన నేను తొలిసారిగా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. సమాజానికీ, దేశానికి ఉపయోగపడే సందేశంతో ఈ సినిమా తీస్తున్నాం’ అన్నారు నిర్మాత జనార్థన్. అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, హనుమ, హిమజ, జయ, వాహినీ, మేఘనా రుషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, నిర్మాణ నిర్వహణ: ఎన్.సుబ్బారాయుడు.