పవన్‌తో పోటాపోటీ

ABN , First Publish Date - 2023-04-29T01:47:26+05:30 IST

‘సుస్వాగతం, బద్రి’ నుంచి మొన్నటి ‘వకీల్‌సాబ్‌’ దాకా పలు చిత్రాల్లో పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌ నటనలో ‘నువ్వా నేనా’ అన్నరీతిలో తలపడి అభిమానులను అలరించారు.

పవన్‌తో పోటాపోటీ

‘సుస్వాగతం, బద్రి’ నుంచి మొన్నటి ‘వకీల్‌సాబ్‌’ దాకా పలు చిత్రాల్లో పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌ నటనలో ‘నువ్వా నేనా’ అన్నరీతిలో తలపడి అభిమానులను అలరించారు. అందుకే ఫ్రేమ్‌లో వారిద్దరూ కనిపిస్తే అభిమానులకు పండగే. మరోసారి పవన్‌, ప్రకాశ్‌రాజ్‌ కాంబినేషన్‌ కుదిరింది. సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ (ఓజీ) చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ఆయన ఓజీ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌లో తెలిపింది. ఓజీ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత.

Updated Date - 2023-04-29T01:47:26+05:30 IST