పరారీ.. పరారీ
ABN , First Publish Date - 2023-03-07T00:20:39+05:30 IST
యోగేశ్వర్, అతిధి జంటగా రూపుదిద్దుకొన్న ‘పరారీ’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. సాయి శివాజీ దర్శకత్వంలో జి.వి.వి.గిరి నిర్మించిన ఈ చిత్రం పోస్టర్‌ను, సెకండ్ టీజర్‌ను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు...

యోగేశ్వర్, అతిధి జంటగా రూపుదిద్దుకొన్న ‘పరారీ’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. సాయి శివాజీ దర్శకత్వంలో జి.వి.వి.గిరి నిర్మించిన ఈ చిత్రం పోస్టర్‌ను, సెకండ్ టీజర్‌ను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నేను సుమన్‌గారి అభిమానిని. ఆయన నూరో సినిమా నేనే తీద్దామనుకున్నాను. అది కుదరలేదు. ఇప్పుడు ఈ చిత్రంలో ఆయన ఓ మంచి పాత్ర పోషించారు. మా అబ్బాయి యోగేశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. మంచి కథకథానాలతో సినిమా రూపుదిద్దుకొంది’ అని తెలిపారు. సినిమాలో పాటలన్నీ బాగా వచ్చాయనీ, సంగీత దర్శకుడిగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా ఇదనీ మహిత్ నారాయణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, జె.జె.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.