Guntur Kaaram: ‘గుంటూరు కారం’, ‘రాఖీ’కి ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాల్సిందే..!

ABN , First Publish Date - 2023-06-01T20:31:28+05:30 IST

మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్ వచ్చేసింది. దాదాపు 24 గంటల క్రితం సినిమా యూనిట్ టైటిల్ రివీల్ చేసింది. ‘గుంటూరు కారం’ పేరుతో మాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు.. ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబోలో 2006లో వచ్చిన ‘రాఖీ’ సినిమాకు ఒక సంబంధం ఉంది.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’, ‘రాఖీ’కి ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాల్సిందే..!

మహేశ్ బాబు అభిమానులు (Mahesh Babu Fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన త్రివిక్రమ్ సినిమా (Trivikram Mahesh Movie) అప్‌డేట్ వచ్చేసింది. దాదాపు 24 గంటల క్రితం సినిమా యూనిట్ టైటిల్ రివీల్ చేసింది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) పేరుతో మాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు.. ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబోలో 2006లో వచ్చిన ‘రాఖీ’ (Rakhi) సినిమాకు ఒక సంబంధం ఉంది.

418278_335530773150876_1880631857_n.jpg

17 ఏళ్ల క్రితం వచ్చిన ‘రాఖీ’ సినిమాకు, 2023లో షూటింగ్ పూర్తి చేసుకుని 2024లో సంక్రాంతికి రాబోతున్న ‘గుంటూరు కారం’ సినిమాకు సంబంధం ఏంటని ఆశ్చర్యపోకండి. అయినా.. ‘రాఖీ’ సినిమా ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలపై తీసిన కథ. ‘గుంటూరు కారం’ సినిమా చూస్తుంటే పక్కా కమర్షియల్ సినిమాలా ఉందని రెండు కథలను కూడా పోల్చి చూడకండి. ‘రాఖీ’, ‘గుంటూరు కారం’.. ఈ రెండు సినిమాలకు ఉన్న ఒకేఒక్క సంబంధం టైటిల్ ట్యాగ్‌లైన్.

390377_308407249196562_1701434095_n.jpg

అవును.. ‘గుంటూరు కారం’ టైటిల్‌ ట్యాగ్‌లైన్‌ను గమనించారో.. లేదో.. Highly Inflammable అని ఇంగ్లీష్‌లో ఉంది. అచ్చం.. ఇదే ట్యాగ్‌లైన్ ‘రాఖీ’ సినిమా టైటిల్‌కు కూడా ఉండటం కొసమెరుపు. గుంటూరు కారం ఘాటును, ఎగసిపడే మంటలతో పోల్చుతూ మరింత స్పైసీగా టైటిల్‌ను త్రివిక్రమ్ ఎలివేట్ చేశాడు. ‘రాఖీ’ సినిమాలో ఆడవాళ్లపై అమానుషాలు పాల్పడే వాళ్లపై హీరో పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేస్తుంటాడు. అందువల్ల.. ‘రాఖీ’ సినిమా టైటిల్‌కు Highly Inflammable అనే ట్యాగ్‌లైన్‌ను కృష్ణవంశీ డిసైడ్ చేశారు. త్రివిక్రమ్ వాంటెడ్‌గా కాకపోయినా మళ్లీ అదే ట్యాగ్‌లైన్ ‘గుంటూరు కారం’ టైటిల్‌కు వాడేశారు. థియేటర్లలో వీక్షించిన మహిళల నీరాజనాలను ‘రాఖీ’ సినిమా అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. కృష్ణవంశీ, ఎన్టీఆర్.. ఇద్దరికీ ఈ సినిమా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

FxdWxh5aEAEz8Pp.jpg

‘రాఖీ’ సినిమా తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చందమామ’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక.. 2006 సంవత్సరం ఎన్టీఆర్‌కు ‘రాఖీ’తో పాటు ‘అశోక్’ రూపంలో మరో ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. అయితే.. 2007లో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో, ఏ స్థాయి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది. ‘రాఖీ’ సినిమా ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ‘గుంటూరు కారం’ Highly Inflammable ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే 2024 సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే.

Mahesh1.jpg

పైగా.. మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా కావడం విశేషం. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్‌ను అందించలేకపోయాయి. ఈ రెండు సినిమాలను బుల్లితెరపై హిట్ చేసిన ప్రేక్షకులు వెండితెరపై చూసి మాత్రం ఎందుకో పెదవి విరిచారు. అందువల్ల.. ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘గుంటూరు కారం’ సినిమాపై అటు అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

Updated Date - 2023-06-01T20:43:59+05:30 IST