O Saathiya: ‘ఓ సాథియా’కు క్లీన్ ‘యు’

ABN , First Publish Date - 2023-07-04T22:37:48+05:30 IST

ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ‘ఓ సాథియా’ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతుండగా.. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని జూలై 7న విడుదలకు సిద్ధమైంది.

O Saathiya: ‘ఓ సాథియా’కు క్లీన్ ‘యు’

లవ్ స్టోరీలలో డిఫరెంట్ యాంగిల్ తీసుకొని సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతుండగా.. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని జూలై 7న విడుదలకు సిద్ధమైంది.

సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందిందీ చిత్రం. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారని, చిత్రంలోని సన్నివేశాలపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారని మేకర్స్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. అలీ చిత్రయూనిట్‌తో ఇంటరాక్ట్ కావడం, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చేయడం వంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించారు.

చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కాబోతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన UFO మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని జూలై 7న గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. దీంతో చిత్ర రిలీజ్‌కి ముందే మంచి బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ మెప్పుపొందుతూ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Updated Date - 2023-07-04T22:37:48+05:30 IST