ఆ పాత్ర ఎన్టీఆరే చేయగలడు

ABN , First Publish Date - 2023-09-04T00:30:59+05:30 IST

గదర్‌ చిత్రంలో తారాసింగ్‌ పాత్రకు ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్‌ మాత్రమే న్యాయం చేయగలడ’ని బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ అన్నారు

ఆ పాత్ర ఎన్టీఆరే చేయగలడు

‘గదర్‌’ చిత్రంలో తారాసింగ్‌ పాత్రకు ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్‌ మాత్రమే న్యాయం చేయగలడ’ని బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ అన్నారు. సన్నీడియోల్‌ హీరోగా ఆయన రూపొందించిన ‘గదర్‌ 2’ ఘన విజయం అందుకొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘తారాసింగ్‌ పాత్ర ను అద్భుతంగా పండించగల హీరోలు బాలీవుడ్‌లో లేరు. దక్షిణాదిలో మాత్రమే ఉన్నారు. ఎన్టీఆర్‌ అయితే తారాసింగ్‌ పాత్రకు సరితూగుతారు’ అని చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. హిందీలో హృతిక్‌ రోషన్‌తో కలసి ‘వార్‌ 2’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - 2023-09-04T00:30:59+05:30 IST