Neethone Nenu: ఇద్దరమ్మాయిలతో.. ‘నీతోనే నేను’

ABN , First Publish Date - 2023-07-28T21:14:43+05:30 IST

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో తాజాగా ఆవిష్క‌రించారు.

Neethone Nenu: ఇద్దరమ్మాయిలతో.. ‘నీతోనే నేను’

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’ (Neethone Nenu). ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో తాజాగా ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే టైంలోనే సినిమా తీయాలనే కల ఉండేది. నాకు మంచి టీం దొరకడంతోనే ఇలా మీ ముందుకు రాగలిగాను. నా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, నా స్నేహితుడు నవీన్ కుమార్‌లకు థాంక్స్. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ‘నీతోనే నేను’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. (Neethone Nenu Title Poster Launch)


డైరెక్టర్ అంజి రామ్ (Anji Ram) మాట్లాడుతూ.. ‘‘అనుకున్న టైంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా సుధాకర్ గారు క్వాలిటీగా తీసేందుకు అండగా నిలబడ్డారు. సుధాకర్ రెడ్డి‌గారి వల్లే ఈ రోజు సినిమా ఇంత బాగా వచ్చింది. మా టీం అద్బుతంగా పని చేసింది. సాంగ్స్, కొరియోగ్రఫీ ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. వికాస్, మోక్ష, కుషిలు చక్కగా నటించారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాము’’ అని తెలిపారు.

Neethone-Nenu-1.jpg

‘ఇంత మంచి సినిమాను ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్‌‌గారికి థాంక్స్. వారు ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, మళ్లీ వారితో కలిసి పని చేయాలని కోరుకుంటున్నానని హీరో వికాస్ వశిష్ట తెలుపగా.. ఒక మంచి స్టోరీలో నటించినందుకు హీరోయిన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో నిర్మాత సుధాక‌ర్ రెడ్డి పుట్టిన‌రోజును సందర్భంగా కేక్ క‌టింగ్ సెల్ర‌బేష‌న్స్‌ను నిర్వ‌హించారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది

**************************************

*Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి

*************************************

* Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు

*************************************

*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

**************************************

*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

Updated Date - 2023-07-28T21:14:43+05:30 IST