Slum Dog Husband: నందమూరి హీరో చేతుల మీదుగా ట్రైలర్ విడుదల
ABN , First Publish Date - 2023-06-29T16:00:17+05:30 IST
‘పిట్ట కథ’ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ (నటుడు బ్రహ్మాజీ తనయుడు).. ఇప్పుడు ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తోంది.
నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఓ చిన్న సినిమాకు తన సపోర్ట్‌ని అందించారు. ‘పిట్ట కథ’ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ (Sanjay Rao).. ఇప్పుడు ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ (Slum Dog Husband) అనే కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘పిట్ట కథ’ సినిమా వైవిధ్యమైన థ్రిల్లర్‌గా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు రాబోతున్న ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ కూడా వైవిధ్యమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో తెలుస్తోంది. ఈ ట్రైలర్‌ని నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మా అందరికీ కావాల్సిన మనిషి బ్రహ్మాజీ ఈ సినిమాకు అండగా ఉన్నారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. (Slum Dog Husband Trailer Launch)
ట్రైలర్ (Slum Dog Husband Trailer Report) విషయానికి వస్తే.. స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి కోసం తాపత్రయ పడే సీన్లతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి వీలు పడదని, ఆ అబ్బాయికి ఉన్న గండం కారణంగా మొదటిగా కుక్కని పెళ్లి చేసుకుంటాడు. ఇక కుక్కని పెళ్లి చేసుకున్నాక ఆ గండం గట్టెక్కిందిలే.. అనే నమ్మకంతో హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. కోర్టులో మొదటి భార్య (కుక్క) బతికి ఉండగా రెండో భార్యని ఎలా చేసుకుంటారు అని కేసు పెట్టడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఇది వింతగా అనిపించడమే కాకుండా అంతే స్టాయిలో ఎగ్జయిట్‌మెంట్‌ని కూడా పెంచేస్తోంది. మొత్తంగా అయితే ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. అంతేకాదు ఈ ట్రైలర్‌లో బ్రహ్మాజీ, సప్తగిరి, అలీ వంటి వారు కూడా కామెడీని పండించినట్లుగా అర్థమవుతోంది.
సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ (Pranavi Manukonda), బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సునీల్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఏఆర్ శ్రీధర్ (AR Sridhar) దర్శకత్వం వహించగా, మైక్ మూవీస్ (Mike Movies) బ్యానర్‌పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Balakrishna and Sridevi Combo: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని మించి ఉండాల్సిన సినిమా.. ఆగిపోయింది
**************************************
*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!
**************************************
*Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు
**************************************
*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..
**************************************