Custody: హెడ్ అప్ హై.. పోలీసులకు ఘనమైన ట్రిబ్యూట్
ABN , First Publish Date - 2023-04-10T23:04:30+05:30 IST
లెజెండరీ కంపోజర్ ఇళయరాజా (Maestro Ilaiyaraaja), ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా (Little Maestro Yuvan Shankar Raja) కంపోజ్ చేసిన కస్టడీ మూవీలోని పాట..
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెమండస్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా మ్యూజిక్ జర్నీని మేకర్స్ మొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా (Maestro Ilaiyaraaja), ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా (Little Maestro Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హెడ్ అప్ హై థంపింగ్ బీట్, పవర్ ఫుల్ లిరిక్స్ మాస్ కాంబో. ఈ పాట పోలీసులకు ఘనమైన ట్రిబ్యూట్ అనేలా ఉంది.
అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంది. సాహిత్యం పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది. నాగ చైతన్య తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నిస్సందేహంగా ఇది చార్ట్‌బస్టర్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Custody First Single Head Up High)
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై (Srinivasaa Silver Screen) భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
*********************************
*Samantha: నేను ఫేస్ చేసిన సమస్యల వల్లే.. ఇప్పుడిలా మారిపోయా!
*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్
*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది
*MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం
*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..
*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!