Thandel: నాగ్ స్విచ్.. వెంకీ క్లాప్.. అరవింద్ స్క్రిఫ్ట్
ABN , First Publish Date - 2023-12-09T15:06:30+05:30 IST
యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాలు వచ్చాయి. శనివారం ‘తండేల్’ సినిమా హైదరాబాద్‌లో లాంచనంగా పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది.
యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని (Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti).. గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు (Bunny Vas) నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ (Thandel) కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడో చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘తండేల్’ చిత్రం.. నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది. శనివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు నాగార్జున (Nagarjuna) కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ (Venkatesh) క్లాప్ కొట్టారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.
అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు నమస్కారం. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా జరుగుతోంది. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా వుంది. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనే దానిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ కథని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళి చూపించాలి. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి చాలా అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం గీతా ఆర్ట్స్‌లోనే సినిమా చేయాలని నిర్ణయించుకొని, ఈ కథకు నాగచైతన్య సరిపోతారని ఆయన దగ్గరకి తీసుకెళ్ళినపుడు ఆయన విని ఎక్సయిట్ అయ్యారు. నాగచైతన్యకు సరైన జోడీగా మా బంగారు తల్లి సాయిపల్లవి వచ్చారు. (Thandel Movie Launched)
ఈ మధ్య సినిమాని పెద్దగా చూడటం అలవాటైయింది. అలాగే పెద్దగా తీయాలి, పెద్దగా రిలీజ్ చేయాలి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైనప్పుడు పాన్ ఇండియా సౌండ్ అలవాటు చేసిన దేవిశ్రీ ప్రసాద్ రావడం, అలాగే కెమెరామ్యాన్ షామ్‌దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇలా అద్భుతమైన టీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం చాలా అనందంగా వుంది. ఈ కథని భాను రియాజ్ కార్తిక్ మా వద్దకు తీసుకొచ్చారు, నిజంగా జరిగిన కథ ఇది. ఇలాంటి కథ గీతా ఆర్ట్స్‌లో తీస్తే బావుంటుందని వాసు దగ్గరకి తీసుకొచ్చారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో టీం అంతా కూర్చొని ప్రతి విషయాన్ని చర్చించుకున్నపుడు చాలా సంతోషంగా అనిపించింది. సినిమాని ఇలా తీయాలి కదా అనే తృప్తి వచ్చింది. ‘తండేల్’ టైటిల్ గురించి అడుగుతున్నారు. తండేల్ అంటే ఏమిటీ అంటూ అందరూ ఆశ్చర్యంగా అడుగుతున్నారు. టైటిల్‌కి అర్థం ఇంకొన్ని రోజుల్లో అందరికీ తెలుస్తుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చి టీంని అభినందించిన, ఆశీర్వదించిన నాగార్జున, వెంకటేష్‌లకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. (Allu Aravind about Thandel Movie)
ఇవి కూడా చదవండి:
====================
*Harish Shankar: నా అపోహని ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేసినందుకు..
*******************************
*Pushpa Keshava: ‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..?
***************************************