Custody Teaser: ఈ టీజర్‌కి హైలెట్ ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-16T20:09:00+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni), తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). నాగచైతన్య కెరీర్‌కి ఈ చిత్రం

Custody Teaser: ఈ టీజర్‌కి హైలెట్ ఏంటో తెలుసా?
Naga Chaitanya in Custody

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni), తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). నాగచైతన్య కెరీర్‌కి ఈ చిత్రం ఎంతో కీలకమైనది. అందులోనూ ఈ చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా చైతూ అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేసింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ని (Custody Teaser) మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌లానే ఈ టీజర్ కూడా సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తోంది. టీజర్ విషయానికి వస్తే..

చైతూ (Chitu) వాయిస్‌తో పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.. ‘‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో.. ఎప్పుడు, ఎలా వస్తుందో నాకు తెలీదు.. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ (Truth) ఈజ్ ఇన్ మై కస్టడీ’’ అంటూ నాగచైతన్య చెప్పిన ఈ ఫుల్ లెంగ్త్ డైలాగ్‌తో పాటు పరిచయం చేసిన పాత్రలు, ఆ పాత్రల వెనుక ఉన్న నేపథ్యం అంతా చూస్తుంటే.. సరికొత్త కథని ప్రేక్షకులకు మేకర్స్ చెప్పబోతున్నారనేది అర్థమవుతోంది. (Custody Teaser Talk)

అలాగే నాగ చైతన్య తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొడితే.. కృతి శెట్టి (Krithi Shetty) అతని గర్ల్‌ఫ్రెండ్‌గా కూల్‌గా కనిపించింది. ఆమెకు కూడా యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లుగా టీజర్‌లో చూపించారు. ఇక టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి (Arvind Swami) తన విలనీతో క్యారెక్టర్‌కి ఎక్స్‌ట్రా ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. శరత్‌కుమార్ (Sarathkumar), ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో కన్విన్సింగ్‌గా కనిపించారు. ఎప్పుడూ కొత్తదనం వుండే కథలనే ఎంచుకునే దర్శకుడు వెంకట్ ప్రభు.. మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్నట్లుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. అయితే కథాంశం గురించి పెద్దగా ఈ టీజర్‌లో వెల్లడించలేదు కానీ.. టీజర్‌ కట్ చేసిన విధానం సినిమాపై క్రేజ్‌ని పెంచేదిగా ఉంది. ఇక ఈ టీజర్ అంతా ఒక ఎత్తయితే.. మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilaiyaraaja), లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా (Little Maestro Yuvan Shankar Raja) ద్వయం ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కి ప్రధాన హైలెట్ అనేలా ఉంది. మొత్తంగా.. ఈ టీజర్ సినిమాపై భారీగా హైప్‌ని పెంచేలా అయితే ఉంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం మే 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నఈ చిత్రాన్ని పవన్‌కుమార్‌ (Pavan Kumar) సమర్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-16T20:09:02+05:30 IST