Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

ABN , First Publish Date - 2023-08-16T17:46:20+05:30 IST

కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం
Kartikeya and Ram Charan

21 డిసెంబర్ 2012... ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు! ఆ రోజు యుగాంతం రాలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్ ఏం చేశాడు? అనేది ఆగస్ట్ 25న వెండితెరపై చూడాలంటున్నారు ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). ఎందుకంటే... శివ శంకర వరప్రసాద్ (Siva Sankara Vara Prasad) పాత్రలో యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ఆ రోజు నుంచి థియేటర్లలో సందడి చేయనున్నారు. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda), ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి (DJ Tillu Fame Neha Sshetty) జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012 Movie). లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైందీ సినిమా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) విడుదల చేశారు.


ట్రైలర్ విడుదల అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ, నేహా శెట్టిల జంట చాలా బాగుంది. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ చాలా బాగుంది.‌ అజయ్ ఘోష్ గారి పాత్ర వచ్చినప్పటి నుంచి ఇంకా బాగుంది. సంగీతం కూడా చాలా కొత్తగా వినిపించింది. ‘ఆర్ఎక్స్ 100’ సెన్సేషనల్ హిట్టయింది. కార్తికేయ కొత్త కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని తెలిపారు. (Bedurulanka 2012 Trailer Talk)

Ram-Charan.jpg

ట్రైలర్ విషయానికి వస్తే.. కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా... ఇలా ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. శివశంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ కనిపించగా.. అతడిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా నేహా శెట్టి నటించారు. తాను సిగరెట్ కాల్చడం వల్ల పోతే తన లంగ్స్ పోతాయని, వస్తే తనకే క్యాన్సర్ వస్తుందని ఊరి పెద్దలకు శివ చెప్పడం చూస్తుంటే వాళ్ళను అతడు లెక్క చేయడని అర్థం అవుతోంది. యుగాంతం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిన పెద్దలకు శివ ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ అని అర్థం అవుతోంది.


సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తినప్పప్పటికీ... ముందు మూడు యుగాలను అంతం అవకుండా ఆపలేకపోయినప్పుడు... ఈ బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రామ్ ప్రసాద్) కలిసి కలి యుగాంతాన్ని ఆపేస్తానంటే మీరు ఎలా నమ్మేశారండి?.. అని హీరో ఓ డైలాగ్ చెబుతారు. ప్రేక్షకుల్లో ఆ మాట ఆలోచన కలిగించేలా ఉంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశాన్ని మణిశర్మ సంగీతం ఎలివేట్ చేస్తోంది. మొత్తంగా అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అంశాన్నే దర్శకుడు ఇందులో టచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

***************************************

*Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

***************************************

*Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార

***************************************

*Vishwak Sen: ఊహించిందే జరిగింది.. పెళ్లి లేద్.. ఏం లేద్..

***************************************

*The Soul Of Satya: సాయిధరమ్ తేజ్, స్వాతి.. జీవించేశారు

***************************************

*Bhagavanth Kesari: బాలయ్య విలన్ పని అయిపోయింది

***************************************

Updated Date - 2023-08-16T17:46:20+05:30 IST