మెగా మాస్ అవతార్
ABN , First Publish Date - 2023-01-03T00:17:29+05:30 IST
‘ఉప్పెన’తో ఓ సూపర్ హిట్ అందుకొన్న మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలీల కథానాయిక...
‘ఉప్పెన’తో ఓ సూపర్ హిట్ అందుకొన్న మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలీల కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకొంది. ఈయేడాది ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వైష్ణవ్‌ని పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించబోతున్న చిత్రమిది. టైటిల్‌తో పాటు ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.