Nagababu: నా గాయం మానిపోయింది.. అందుకు చరణే కారణం!
ABN , First Publish Date - 2023-03-28T18:52:12+05:30 IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా నాగబాబు (Nagababu) నిర్మించిన ‘ఆరెంజ్’ (Orange) సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. నాగబాబుకి నిద్రలేని రాత్రులను
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా నాగబాబు (Nagababu) నిర్మించిన ‘ఆరెంజ్’ (Orange) సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. నాగబాబుకి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఈ సినిమా గురించి పలు సందర్భాలలో నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. సూసైడ్ వరకు వెళ్లివచ్చానని, అన్నయ్య చిరంజీవి (Chiranjeevi).. తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ సమయంలో నిలబడ్డారు కాబట్టే.. ఇంకా ఉన్నానంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. చరణ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా ఆ చిత్రం నిలిచింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజును (Ram Charan Birthday) పురస్కరించుకుని స్పెషల్ షో (Special Show)లు వేశారు. ఈ షోల ద్వారా వచ్చిన కలెక్షన్స్‌ని జనసేన పార్టీకి (Janasena Party) విరాళంగా ఇస్తానని నాగబాబు చెప్పారు. మరి నాగబాబు చెప్పిన ఈ మాట నచ్చిందో.. లేదంటే ఆయన తాజాగా చెబుతున్నట్లుగా ఈ జనరేషన్‌కి ఆ సినిమా నచ్చిందో తెలియదు కానీ.. వేసిన స్పెషల్ షో లన్నీ (Orange Special Shows) హౌస్‌ఫుల్ అయ్యాయి. ఫ్రెష్‌గా రిలీజైన సినిమాకి వచ్చినట్లుగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో నాగబాబు ఓ వీడియో ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. చిరుత (Chirutha), మగధీర (Magadheera) వంటి రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత రామ్ చరణ్‌కు మూడో సినిమాగా వచ్చిన ‘ఆరెంజ్’ (Orange Movie)తో ఫ్లాప్ సినిమా ఇచ్చానని ఈరోజు వరకూ చాలా బాధపడ్డాను. అదొక గాయంలా ఇప్పటి వరకు నన్ను వెంటాడింది. చరణ్ పుట్టినరోజుకు ఈ సినిమాను రీ రిలీజ్ చేయమని అంతా అడుగుతుంటే.. చాలా ఆలోచించాను. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడం కరెక్టేనా? అని ఆలోచిస్తున్న సమయంలో.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాకు ఆస్కార్ (Oscar), గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) అవార్డ్స్ రావడం నాలో ఉత్సాహాన్ని నింపింది. ఈ పుట్టినరోజుకి చరణ్ కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే బాగుంటుందనిపించింది. ఈ విషయంలో అల్లు అరవింద్‌గారు అండ్ టీమ్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘మగధీర’ రీ రిలీజ్ ఆపేసి.. గీతా ఆర్ట్స్ టీమ్ అంతా నాకు సహకారం అందించారు.
ఇక.. ఇప్పుడు ‘ఆరెంజ్’కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఈ సినిమాకు ఇంతమంది అభిమానులున్నారా? అని మేమంతా ఆశ్చర్యపోయాం. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులకు నచ్చలేదు.. కానీ ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయింది. అందుకే ఇప్పుడు ఒక పెద్ద మూవీకి వచ్చినన్ని కలెక్షన్స్ వచ్చాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. చరణ్ బాబుకు నావల్ల ఓ ప్లాప్ వచ్చింది అనే బాధ ఇప్పుడు పోయింది. ఇప్పుడీ సినిమాని కూడా చరణ్ హిట్‌లలో ఒకటిగా పరిగణించవచ్చనిపించింది. చరణ్ సినీ కెరీర్‌లో నావల్ల ఒక సక్సెస్ దూరమైందన్న గాయం ఈ రీ రిలీజ్‌తో మానిపోయింది. ఇదంతా కూడా చరణ్ వల్లే సాధ్యమైందని అనుకుంటున్నాను. ఇందుకు భాగమైన, సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని ఇప్పుడు ఆదరించిన ప్రేక్షకులకి, మెగాభిమానులందరికీ (Mega Fans) కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని చెప్పుకొచ్చారు. నాగబాబుకు (Naga Babu) కూడా ఈ సినిమా రీ రిలీజ్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. (Nagababu about Orange Special Shows)
ఇవి కూడా చదవండి:
*********************************
*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది
*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!
*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక
*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్
*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?