Mahaveerudu: ‘మహావీరుడు’కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-07-12T16:17:33+05:30 IST
తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా.. ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మహావీరుడు’. జూలై 14న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా తాజాగా మేకర్స్ రివీల్ చేశారు.
తమిళ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా.. ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించిన పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మహావీరుడు’ (Mahaveerudu). జూలై 14న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ (Shanthi Talkies) పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ సపోర్ట్ అందించారు. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన సపోర్ట్ ఏంటో తాజాగా మేకర్స్ రివీల్ చేశారు.
ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. శివకార్తికేయన్ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అతను ఏదో ఒక ప్రత్యేక శక్తి నుండి గైడెన్స్ కోరుతున్నట్లుగా ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు ఓ పవర్‌లో ‘ధైర్యమే జయం’ అంటూ రవితేజ వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా వుంది. రవితేజ వాయిస్ ఓవర్ (Voiceover) సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు.
‘‘రవితేజగారు మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్ అందించడం చాలా ఆనందంగా ఉంది. మహావీరుడు టీమ్‌కి మీరు అందించిన సపోర్ట్‌కి చాలా కృతజ్ఞతలు సార్. జూలై 14 నుండి మహావీరుడు. ధైర్యమే జయం’’ అని శివకార్తికేయన్ (Sivakarthikeyan) తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రవితేజ పేరు వినబడగానే.. ఇప్పుడు ‘మహావీరుడు’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. భరత్ శంకర్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది
**************************************
*Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
**************************************
*Taarakasura: ‘రావణాసుర’ కాదు.. ఇతను ‘తారకాసుర’
**************************************
*Dhwani: దర్శకుడిగా 10 ఏళ్ల పిల్లాడు.. అతని టార్గెట్ ఏంటో తెలుసా?
**************************************