సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మనిషి జీవితం కూడా ‘ఫుల్‌ బాటిల్‌’ లాంటిదే!

ABN, First Publish Date - 2023-05-30T02:40:15+05:30

‘‘నాలుగు క్వార్టర్లు కలిస్తే ఓ ఫుల్‌ బాటిల్‌ అవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. నాలుగు దశలు దాటితేనే జీవితం పరిపూర్ణం అవుతుంది. అందుకే ఈ సినిమాకి ‘ఫుల్‌ బాటిల్‌’ అనే పేరు పెట్టామ’’న్నారు సత్యదేవ్‌. ఆయన కథానాయకుడిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నాలుగు క్వార్టర్లు కలిస్తే ఓ ఫుల్‌ బాటిల్‌ అవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. నాలుగు దశలు దాటితేనే జీవితం పరిపూర్ణం అవుతుంది. అందుకే ఈ సినిమాకి ‘ఫుల్‌ బాటిల్‌’ అనే పేరు పెట్టామ’’న్నారు సత్యదేవ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సంజనా ఆనంద్‌ కథానాయిక. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. రామాంజనేయులు, చినబాబు నిర్మాతలు. ఇటీవల టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నాలోని ఆ కోణాన్ని ఈ సినిమాలో దర్శకుడు బాగా వాడుకొన్నాడు. నన్ను పూర్తిగా మార్చేసి, కొత్త సత్యదేవ్‌ని తెరపైకి తీసుకొచ్చార’’న్నారు. ‘‘సత్యదేవ్‌ చాలా సీరియస్‌ కథలు చేశాడు. తనలోని అల్లరిని బయటకు తీసుకొద్దామనిపించి ఈ కథ రాసుకొన్నాను. డార్క్‌ కామెడీ చిత్రాలు నేను బాగా హ్యాండిల్‌ చేయగలనన్నది నా నమ్మకం. ఆ నేపథ్యంలో సాగే కథ ఇది. తప్పకుండా మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు దర్శకుడు. ‘‘జ్యోతిలక్ష్మి సినిమా నుంచి సత్యదేవ్‌ని గమనిస్తున్నాను. సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు. ‘ఫుల్‌ బాటిల్‌’తో మరో స్థాయికి వెళ్తాడు. తనతో త్వరలోనే మరో చిత్రం నిర్మిస్తా’’ అన్నారు రామాంజనేయులు.

Updated Date - 2023-05-30T02:40:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!