Japan: ‘జపాన్’ డబ్బింగ్.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన మేకర్స్
ABN , First Publish Date - 2023-09-14T22:08:03+05:30 IST
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ ప్రస్తుతం ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లుగా మేకర్స్ ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేశారు.
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదివరకే కార్తీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. (Japan Update)
ఈ చిత్ర డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లుగా మేకర్స్ ఓ వీడియోను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో కార్తీ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. కార్తి డబ్బింగ్ చెబుతుంటారు. కానీ టేక్ ఎంతకీ ఓకే అవ్వదు. చివరికి టైటిల్ రోల్ జపాన్ గెటప్‌తో వచ్చి చెప్పడంతో ఓకే అవుతుంది. ఈ వీడియో, ముఖ్యంగా జపాన్ పెక్యులర్ వాయిస్, లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది. యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. (Japan Dubbing Started)
కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారి నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దీపావళికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
============================
*Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం
***********************************
*CP CV Anand: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. ‘బేబీ’ టీమ్‌కు నోటీసులు.. పరారీలో హీరో!
***********************************
*Devil: సిద్ శ్రీరామ్ పాడిన పాట.. విడుదల ఎప్పుడంటే..
***********************************
*Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్’ నిర్మాత బహుమతి ఏది?
***********************************