జవాన్ ఎమోషనల్ జర్నీ
ABN , First Publish Date - 2023-07-11T04:48:42+05:30 IST
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ మూవీ ప్రీవ్యూను సోమవారం విడుదల చేశారు. సమాజంలోని తప్పుల్ని సరిదిద్దడానికి ఓ వ్యక్తి చేసే ఎమోషనల్ జర్నీ...

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ మూవీ ప్రీవ్యూను సోమవారం విడుదల చేశారు. సమాజంలోని తప్పుల్ని సరిదిద్దడానికి ఓ వ్యక్తి చేసే ఎమోషనల్ జర్నీ ఈ చిత్రమని ప్రివ్యూ చూడగానే అర్థమవుతుంది. యాక్షన్ ప్యాక్డ్‌గా రూపొందిన ‘జవాన్’ ప్రీవ్యూ సినిమా మీదున్న అంచనాలను అమాంతం పెంచేసింది. షారుఖ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ప్రీవ్యూ లోని ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠ పెంచింది. షారుఖ్ లుక్స్, నయనతార, దీపిక పదుకోన్ ప్రజెన్స్, యాక్షన్ సీన్స్, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే ‘ఈ మౌనం.. ఈ బిడియం’ రెట్రో సాంగ్‌లో షారుఖ్ నటన మెప్పిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం, అద్భుతమైన విజువల్స్‌తో దర్శకుడు అట్లీ ఈ సినిమాను చిత్రీకరించారని అర్థమవుతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ రాని విధంగా భారీ బడ్జెట్‌తో, తారాగణంతో రూపుదిద్దుకున్న ‘జవాన్’ ప్రేక్షకులను అలరించడానికి సెప్టెంబర్ 7న విడుదల కానుంది.రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.