Jagratha Bidda: మంత్రి మల్లారెడ్డి సినిమా బాటలో ఫైర్ బ్రాండ్ సీతక్క
ABN , First Publish Date - 2023-06-15T22:23:02+05:30 IST
కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ సీతక్క కూడా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నడుస్తున్న సినిమా బాటలోనే నడిచి.. ఓ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ సినిమా పేరే ‘జాగ్రత్త బిడ్డా’. కృష్ణ మోహన్ దర్శకత్వంలో కె.ఎస్.బి.క్రియేషన్స్ - ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై... విశ్రాంత పోలీస్ అధికారి శ్రీకాంత్ కరణం - ఎమ్.వై. గిరిబాబు నిర్మించారు.

ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) చేతుల మీదుగా సినిమా వేడుకలు ఎన్నో జరుగుతున్నాయి. ట్రైలర్ విడుదల చేయాలన్నా, పాట విడుదల చేయాలన్నా.. అందరూ మల్లారెడ్డి వెంట పడుతుండటం చూస్తునే ఉన్నాం. మరి అందులో మతలబు ఏముందో తెలియదు కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే (Mulugu MLA) ఫైర్ బ్రాండ్ సీతక్క (Seethakka) కూడా మల్లారెడ్డి సినిమా బాటలోనే నడిచి.. ఓ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ సినిమా పేరే ‘జాగ్రత్త బిడ్డా’ (Jagratha Bidda). కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు చెల్లెళ్ళకు జరిగిన తీరని అన్యాయానికి ఓ అన్న విధించిన శిక్ష నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జాగ్రత్త బిడ్డా’.
టీవీ సీరియల్స్ రూపకల్పనలో అనుభవశాలి కృష్ణ మోహన్ (Krishna Mohan)ను వెండితెరకు దర్శకుడిగా పరిచయం చేస్తూ... కె.ఎస్.బి.క్రియేషన్స్ - ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై... విశ్రాంత పోలీస్ అధికారి శ్రీకాంత్ కరణం (Srikanth Karanam) - ఎమ్.వై. గిరిబాబు (M.Y. Giri Babu) సంయుక్తంగా ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈ నెల 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. మినిమం గ్యారంటీ మూవీస్ (ఎమ్.జి.ఎమ్) ద్వారా డిస్ట్రిబ్యూటర్ ఎమ్. అచ్చిబాబు (M. Atchibabu) ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ (Jagratha Bidda Trailer)ను ములుగు ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్ సీతక్క విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘డి.జె.టిల్లు (DJ Tillu), బలగం (Balagam)’ చిత్రాల తరహాలో.. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రం మంచి విజయం సాధించాలని ఆమె అభిలషించారు. అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్.. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, సాయి వెంకట్‌లతోపాటు చిత్రబృందం పాల్గొని.. సీరియస్ ఇష్యూ బ్యాక్ డ్రాప్‌లో గ్రిప్పింగ్ నేరేషన్‌తో రూపొందిన ఈ ‘జాగ్రత్త బిడ్డా’ (Jagratha Bidda) చిత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను
**************************************
*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..
**************************************
*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!
**************************************
*SJ Suryah: అమితాబ్ బచ్చన్ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..
**************************************
*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి
**************************************
*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..
**************************************