చక్రి పాటలు విన్నట్టే ఉంది
ABN , First Publish Date - 2023-03-28T03:33:04+05:30 IST
యోగేశ్వర్, అతిధి జంటగా నటిస్తున్న చిత్రం ‘పరారీ’. సాయి శివాజీ దర్శకుడు. జి.వి.వి. గిరి నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఎల్ల ఎల్ల’ అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు...

యోగేశ్వర్, అతిధి జంటగా నటిస్తున్న చిత్రం ‘పరారీ’. సాయి శివాజీ దర్శకుడు. జి.వి.వి. గిరి నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఎల్ల ఎల్ల’ అనే గీతాన్ని ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. రామజోగయ్య శాస్ర్తి రాశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ ‘‘పాట చాలా బాగుంది. మహిత్ ట్యూన్ వింటుంటే చక్రి పాటలు విన్నట్టుగానే హాయిగా ఉంది. విజువల్స్ కూడా చక్కగా కుదిరాయి’’ అన్నారు. ‘‘కొంతమంది యువకులు ఓ సమస్యపై ఎలా పోరాడారు? ఎలాంటి ఫలితాన్ని సాధించారు అనేదే ఈ చిత్ర కథ. ఈనెల 30న విడుదల చేస్తున్నామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.