కొంచెం భయపెడితే... చూస్తారు
ABN , First Publish Date - 2023-12-14T00:43:41+05:30 IST
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ‘పిండం’ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 15న విడుదలవుతున్న సందర్బంగా ఆయన...

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ‘పిండం’ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 15న విడుదలవుతున్న సందర్బంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘పిండం’ కథ చెప్పే ముందు దర్శకుడు సాయికిరణ్ తను తీసిన ‘స్మోక్’ అనే షార్ట్ ఫిల్మ్ చూపించారు. అది నాకు ఎంతో నచ్చింది. ‘పిండం’ కథ కూడా నచ్చడంతో అంగీకరించాను. అతీంద్రియ శక్తుల మీద పరిశోధనలు చేసే లోక్‌నాథ్ అనే పాత్రను పోషించాను. నేను హారర్ సినిమాలు పెద్దగా ఇష్టపడను. అయితే అనుకోకుండా ‘ప్రేమ కథాచిత్రమ్’ థియేటర్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఆశ్చరపోయా. కొంచెం భయపెడితే జనాలు శ్రద్ధగా సినిమా చూస్తారని అర్థమైంది. కేవలం భయపెట్టడమే కాకుండా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా ఉండాలి. అలాంటి సినిమానే పిండం’ అన్నారు.