హలో... నాని!
ABN , First Publish Date - 2023-07-12T01:34:02+05:30 IST
‘దసరా’తో మాస్ ప్రేక్షకుల్ని అలరించాడు నాని. ఇప్పుడు ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నాడు. నాని కథానాయకుడిగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది...

‘దసరా’తో మాస్ ప్రేక్షకుల్ని అలరించాడు నాని. ఇప్పుడు ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నాడు. నాని కథానాయకుడిగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. మృణాల్ ఠాకూర్ కథానాయిక. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మాతలు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం కోసం ‘హలో డాడీ’, ‘హాయ్ డాడీ’ లాంటి పేర్లు పరిశీలిస్తున్నారు. తండ్రీ కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. గురువారం ఫస్ట్ గ్లిమ్స్‌ని విడుదల చేస్తున్నారు. ఈ ప్రచార చిత్రంలో టైటిల్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్.