గోపీచంద్... శ్రీను వైట్ల కాంబో
ABN , First Publish Date - 2023-09-10T00:53:52+05:30 IST
గోపీచంద్ హీరోగా కొత్త చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు.
గోపీచంద్ హీరోగా కొత్త చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత నవీన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. తొలిషాట్‌కు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ చేస్తామని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.