మంచి స్పందన వస్తోంది
ABN , First Publish Date - 2023-09-26T01:20:31+05:30 IST
సీనియర్ నటి జయలలిత సమర్పణలో ఆమె కీలక పాత్ర పోషించిన ‘రుద్రంకోట’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌తో ఆడుతోంది. అనిల్, విభీష, అలేఖ్య హీరోహీరోయిన్లుగా నటించారు...

సీనియర్ నటి జయలలిత సమర్పణలో ఆమె కీలక పాత్ర పోషించిన ‘రుద్రంకోట’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌తో ఆడుతోంది. అనిల్, విభీష, అలేఖ్య హీరోహీరోయిన్లుగా నటించారు. సోమవారం ఏర్పాటు చేసిన సక్సె్‌సమీట్‌లో జయలలిత మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని కేంద్రాల నుంచి మంచి స్పందన వస్తోంది. కథ, కథనాలతో పాటు సంగీతం, దర్శకత్వం, నటీసటుల ప్రతిభ.. ఇలా ప్రతి అంశం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు’ అన్నారు. దర్శకుడు రాము కోన మాట్లాడుతూ ‘జయలలితగారు మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం మాకు దక్కింది. విడుదల సమయంలో ఎలాంటి సమస్య లేకుండా స్ర్కీన్ మాక్స్ వారు 200 థియేటర్లలో భారీగా రిలీజ్ చేశారు. స్పందన బాగుంది’ అన్నారు.