Adipurush: ఆదిపురుష్ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-06-13T19:29:46+05:30 IST
గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రానికి ఇప్పటి వరకు ఏమోగానీ, రిలీజ్ దగ్గర పడే కొద్దీ అన్నీ పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు తెలంగాణ సర్కార్ తియ్యటి శుభవార్తను తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ చిత్రానికి 6వ ఆటకు అనుమతిని, అలాగే సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 50లను పెంచుకునేలా జీవో జారీ చేసింది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి ఇప్పటి వరకు ఏమోగానీ, రిలీజ్ దగ్గర పడే కొద్దీ అన్నీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఈ చిత్రానికి సంబంధించిన టికెట్స్‌ను బల్క్‌గా కొనుగోలు చేసి.. పిల్లల సేవా సంస్థలకు, అనాధాశ్రమాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ (Telangana Government) కూడా ఈ చిత్ర యూనిట్‌కు తియ్యటి శుభవార్తను (Good News) అందించింది. ఈ సినిమాకు ఆరో ఆటకు అనుమతి, అలాగే సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో 3 రోజుల పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా జీవో జారీ చేసింది. దీంతో ‘ఆదిపురుష్’ చిత్రానికి అదృష్టం మాములుగా లేదంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
వాస్తవానికి ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు అంతా యానిమేషన్ సినిమాలా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దిద్దుబాబు చర్యలు చేపట్టి.. కొన్ని మార్పులు, చేర్పుల అనంతరం విడుదల చేసిన ట్రైలర్‌తో మెప్పించారు. ట్రైలర్ తర్వాత ఈ సినిమా రూపురేఖలన్నీ మారిపోయాయి. ఒక్కసారిగా ‘జైశ్రీరామ్’ స్లోగన్స్ మొదలయ్యాయి. అలాగే ఇటీవల తిరుపతి (Tirupati)లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event) కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ప్రీ రిలీజ్ అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో మేకర్స్‌తో పనిలేకుండానే.. ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీ వచ్చేస్తోంది. సోషల్ మీడియా అంతటా కూడా ఆదిపురుష్ జపమే నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ చెప్పిన తీపికబురుతో ఫ్యాన్స్ మరోసారి ఆదిపురుష్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశారు.
‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెల్లవారు జామున 4 గంటల నుంచే థియేటర్లలో ప్రదర్శించేలా, అలాగే మూడు రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం (Telangana) జీవోని జారీ చేసింది. ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వాన్ని కూడా మేకర్స్ ఈ విషయంపై సంప్రదించగా.. ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఎటువంటి అభిప్రాయం రాలేదని తెలుస్తోంది. అందుకే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బుకింగ్స్ మొదలు కాలేదు. ఇప్పుడు తెలంగాణలో జీవో వచ్చేసింది కాబట్టి.. ఇక బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. నార్త్ ఇండియాలో మాత్రం ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ హాట్ కేక్‌లా అమ్ముడవుతున్నట్లుగా తెలుస్తోంది.
క్రెడిట్ గేమ్ అంటూ కామెంట్లు:
ఆదిపురుష్‌పై తెలంగాణ రాష్ట్రం 6వ ఆటకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు జీవో జారీ చేయడంతో.. సోషల్ మీడియాలో మరో రకంగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) పార్టీలు పోటీ పడుతున్నాయని, క్రెడిట్ కొట్టేసేందుకు ఆరాటపడుతున్నాయంటూ కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమిత్ షాను ప్రభాస్ (Prabhas), రాజమౌళి (Rajamouli) కలుస్తారు అనే వార్త బయటికి రాగానే కేసీఆర్ (KCR) అలెర్ట్ అయ్యారని, అందుకే రేట్లు పెంచి స్పెషల్ షోలకు అనుమతినిచ్చారనేలా కూడా టాక్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..
**************************************
*Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్ టైటిల్‌తో..
**************************************
*Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!
**************************************
*Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!
**************************************
*Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు
****************************************
*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్
********************************
*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
*******************
*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి
*********************************