Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..
ABN , First Publish Date - 2023-06-14T21:19:43+05:30 IST
తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ టికెట్ల ధరలు పెంచుకునేలా ఆదిపురుష్ టీమ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే 10 రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేలా జీవో విడుదల చేసింది కానీ.. ఫ్యాన్స్ కోరుకునే స్పెషల్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. మరో వైపు తెలంగాణ సర్కార్ ఈ సినిమాకు ఆరో ఆటకు కూడా అనుమతిని ఇచ్చింది.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి ఇప్పటి వరకు ఏమోగానీ, రిలీజ్ దగ్గర పడే కొద్దీ అన్నీ పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఈ చిత్రానికి సంబంధించిన టికెట్స్‌ను బల్క్‌గా కొనుగోలు చేసి.. పిల్లల సేవా సంస్థలకు, అనాధాశ్రమాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ వస్తున్నారు. మంగళవారం ఈ సినిమా యూనిట్‌కు తెలంగాణ సర్కార్ (Telangana Government) తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమాకు ఆరో ఆటకు, అలాగే సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో 3 రోజుల పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) కూడా ఈ సినిమా యూనిట్‌కు స్వీట్ న్యూస్ చెప్పింది. స్వీట్ న్యూస్ అయితే చెప్పింది కానీ.. ఫ్యాన్స్‌ని మాత్రం ఏపీ ప్రభుత్వం డిజప్పాయింట్ చేసింది. అదెలా అంటే..
తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటుతో పాటు.. ఆరో షోకూ కూడా అనుమతి రాగా.. ఏపీలో మాత్రం కేవలం టికెట్ ధరలను మాత్రమే పెంచుకునేలా జీవో వచ్చింది. స్పెషల్ షోలకు మాత్రం అనుమతి రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో.. ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించి విడుదలైన రోజు నుంచి.. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.50 పెంచుకునేలా వెసులుబాటును కల్పించింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆదిపురుష్ చిత్రాన్ని చూడాలంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 115కి మరో రూ. 50 అదనంగా చెల్లాంచాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్‌లో చూడాలంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 177కి మరో రూ. 50 అదనంగా చెల్లించాలి. 3డి వెర్షన్ చూసే వారు గ్లాసెస్‌కి అదనంగా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభాస్ (Prabhas) శ్రీరాముడిగా నటించిన ఈ సినిమాలో కృతిసనన్ (Kriti Sanon) జానకిగా నటించింది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఇవి కూడా చదవండి:
**************************************
*Mahi V Raghav: ‘సైతాన్’ వెబ్ సిరీస్‌పై మరోసారి హెచ్చరిక చేసిన దర్శకుడు
**************************************
*Shah Rukh Khan: ఎంత అభిమాని అయితే మాత్రం.. పబ్లిగ్గా అలా ముద్దు పెట్టేసిందేంటి?
*****************************************
*Sreeleela: బర్త్‌డే బ్యూటీ.. శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా..?
**************************************
*Prabhas Srinu: తల్లి సమానురాలితో ఎఫైరా?.. రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను క్లారిటీ!
**************************************
*Varun Tej: ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యతో కలిసి.. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్
**************************************
*Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?
**************************************
*Adipurush: ఆదిపురుష్ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!
**************************************