ఘోస్ట్ వచ్చేశాడు
ABN , First Publish Date - 2023-01-03T00:10:28+05:30 IST
శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకుడు...
శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. వింటేజ్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన శివ రాజ్ కుమార్ గెటప్, స్టైల్.. మాస్‌కి నచ్చేలా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఇటీవలే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఫిబ్రవరిలో బెంగళూరులో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అందుకోసం అక్కడో భారీ సెట్ తీర్చిదిద్దారు. జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అత్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: అర్జున్ జన్య.