Geetha Sankaram: ప్రేమకథా దృశ్యకావ్యంతో ‘గీతా శంకరం’ వచ్చేశారు..

ABN , First Publish Date - 2023-11-10T20:14:44+05:30 IST

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌ గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా దృశ్యకావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంస్థ కార్యాలయంలో మేకర్స్ ఆవిష్కరించారు.

Geetha Sankaram: ప్రేమకథా దృశ్యకావ్యంతో ‘గీతా శంకరం’ వచ్చేశారు..
Geetha Sankaram Movie Hero and Heroine

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌ గౌడ (Mukhesh Gouda), ప్రియాంక శర్మ (Priyanka Sharma) జంటగా నూతన దర్శకుడు రుద్ర (Rudra) దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ కె. దేవానంద్‌ (K Devanand) నిర్మిస్తున్న ప్రేమకథా దృశ్యకావ్యం ‘గీతా శంకరం’ (Geetha Sankaram). ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంస్థ కార్యాలయంలో మేకర్స్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్‌ మాట్లాడుతూ.. మా ఇష్టదైవమైన శ్రీ సెల్వమహాగణపతి పేరుపై ఆయన దీవెనలతో స్థాపించిన మా ‌ఎస్‌.ఎస్‌.ఎం.జి సంస్థ పేరు మీద ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేశాము. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాము. ఇక్కడ కూడా తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్యకావ్యం. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. సినిమా తీయాలని నిర్ణయించుకోగానే దాదాపుగా 20 మంది కథలు చెప్పారు. కానీ దర్శకుడు రుద్ర చెప్పిన పాయింట్‌ నాకు బాగా నచ్చి, సినిమా ప్రారంభించాం. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఇందుకోసం యూనిట్‌ అందరూ కష్టపడి పని చేస్తుండడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. (Geetha Sankaram Movie First Look)


Geetha-Sankaram-FL.jpg

నటుడు మురళీధర్‌ (Muralidhar) మాట్లాడుతూ.. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో నేను హీరోయిన్‌ తండ్రిగా నటిస్తున్నాను. మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర. ప్రేక్షకులందరి ఆదరణ, ప్రోత్సాహంతో ఈ ‘గీతా శంకరం’ (Geetha Sankaram Movie) మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు రుద్ర మాట్లాడుతూ.. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నా నిర్మాత దేవానంద్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా అద్భుతంగా రావటానికి నాతోపాటు కష్టపడుతున్న ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్స్‌కు నా కృతజ్ఞతలు. రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. మీడియా కూడా సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నచ్చే అంశాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని అన్నారు. ఇంకా హీరో ముఖేష్‌గౌడ, హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. ఈ అవకాశం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Niharika Konidela: ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలోకి.. నిహారిక మరో స్టెప్

****************************************

*Suman: అలా చేస్తే.. అన్ని భాషల సినిమా వాళ్లు ఆంధ్రా వైపు చూస్తారు

***************************************

*Trisha: మెగాస్టార్ చిరంజీవి బాటలో ‘త్రిష’ చిత్రం..

************************************

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

Updated Date - 2023-11-10T20:14:45+05:30 IST