Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..
ABN , First Publish Date - 2023-07-12T17:15:35+05:30 IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఆగస్ట్ 25న గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహాభారతంలో అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా ఈ ప్రీ టీజర్ ఉంది.
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej). ఆయన మరోసారి తనదైన శైలిలో, మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గాంఢీవధారి అర్జున’ (Gandheevadhari Arjuna). స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కా యాక్షన్ మోడ్‌లో ఆకట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఆగస్ట్ 25న గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీ టీజర్ (Gandheevadhari Arjuna Movie Pre Teaser)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ప్రీ టీజర్‌ను గమనిస్తే.. వరుణ్‌తేజ్ (Varun Tej) మునుపెన్నడూ చేయనటువంటి భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు అర్థమవుతోంది. యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే.. మహాభారతంలోని అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా ఉంది. అర్జునుడి రథం, ఓ పాత కారుని ప్రీ టీజర్‌లో గమనించవచ్చు. దాన్ని కంటిన్యూ చేస్తూ కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఫ్లాషస్ రూపంలో చూపించారు. చివరగా ఓ రైఫిల్ పట్టుకుని మెగా ప్రిన్స్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా చూపించారు. ఈ సీన్ కచ్చితంగా థియేటర్‌లోని ఆడియెన్స్‌కు ఓ విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఎగ్జయిట్‌మెంట్‌ను కలిగించేలా రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సౌండ్, విజువల్స్, అలాగే ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త లుక్‌లో అలరించబోతున్నాడనేది ఈ ప్రీ టీజర్ చూస్తుంటేనే తెలుస్తోంది. అతని కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. హ్యూజ్ బడ్జెట్‌తో యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ రూపుదిద్దుకున్న చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఎస్వీసీసీ (SVCC) పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ (BVSN Prasad), బాపినీడు (Bapineedu) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Mahaveerudu: ‘మహావీరుడు’కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?
**************************************
*Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది
**************************************
*Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..
**************************************
*Taarakasura: ‘రావణాసుర’ కాదు.. ఇతను ‘తారకాసుర’
**************************************
*Dhwani: దర్శకుడిగా 10 ఏళ్ల పిల్లాడు.. అతని టార్గెట్ ఏంటో తెలుసా?
**************************************