దేశం కోసం
ABN , First Publish Date - 2023-01-18T01:29:24+05:30 IST
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘దేశం కోసం భగత్‌సింగ్’ చిత్రం...

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘దేశం కోసం భగత్‌సింగ్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నటుడు, నిర్మాత రవీంద్ర గోపాల ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇందులో రవీంద్ర, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలు పోషించారు. సూర్య, జీవా , ప్రసాద్ బాబు, అశోక్‌కుమార్, సుధ ఇతర ముఖ్య తారాగణం. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తామని రవీంద్ర గోపాల చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సూర్యప్రకాశ్, రవీంద్ర గోపాల, పాటలు: రవీంద్ర గోపాల, సంగీతం: ప్రమోద్‌కుమార్, ఛాయాగ్రహణం: సీవీ ఆనంద్.