హాయ్‌ నాన్న కోసం అడ్వాన్స్‌ టెక్నాలజీ వాడాం

ABN , First Publish Date - 2023-12-06T05:13:56+05:30 IST

నాని హీరోగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్నా’ ఈ నెల ఏడున విడుదల కానుంది. శౌర్యువ్‌ దర్శకత్వంలో మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు...

హాయ్‌ నాన్న కోసం అడ్వాన్స్‌ టెక్నాలజీ వాడాం

నాని హీరోగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్నా’ ఈ నెల ఏడున విడుదల కానుంది. శౌర్యువ్‌ దర్శకత్వంలో మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

  • తెలుగులో చేసిన తొలి సినిమాతోనే పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతి సినిమా నాకు ఒక పరీక్షే. ‘హాయ్‌ నాన్న’ చిత్రం నాకు మరింత పేరు తెస్తుంది. నేను, నా మ్యూజిక్‌ టీమ్‌ దర్శకుడు శౌర్యువ్‌కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. ఇది వెరీ సాఫ్ట్‌ రొమాంటిక్‌మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్‌గా చేశాం. లైటింగ్‌ విజువల్స్‌, సంగీతం.. అన్నీ ఆహ్లాదరకంగా మనసుకి ప్రశాంతతని ఇచ్చేలా ఉంటాయి.

  • ఈ సినిమా వర్క్‌ లాస్ట్‌ వీక్‌ పూర్తయినా ఇంకా ఆ హ్యంగోవర్‌లోనే ఉన్నా. దర్శకుడు పాటల్ని అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా చూసి నేనే ఆశ్చర్యపోయా. సినిమాలో ప్రతి పాటకూ ప్రాముఖ్యం ఉంది. సంగీతపరంగా అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌ టెక్నాలజీని ఇందులో ఉపయోగించాం.

  • ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే చిత్రం ‘హాయ్‌ నాన్న’. తెలుగులో ఎన్నో విభిన్న చిత్రాలు వచ్చాయి. వాటిల్లో ‘హాయ్‌ నాన్న’ కూడా ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నాని నటన అద్భుతంగా ఉంది. ఆయన్ని నాచురల్‌ స్టార్‌ అని ఎందుకు అంటారో ఈ సినిమా చూశాక అర్థమైంది. అలాగే మృణాల్‌, బేబి కియారా పాత్రలు కూడా మనసుకి హత్తుకుంటాయి.

  • కథలో ఒక పార్టీ సాంగ్‌ ఉంది. ఆ విజువల్స్‌ని మ్యాచ్‌ చేసే ఎనర్జటిక్‌ సాంగ్‌ కావాలి. దానికి కొంత సమయం పట్టింది. ఒక ట్యూన్‌ రెడీ చేసి దర్శకుడికి పంపాను. ఆయనకు బాగా నచ్చింది. మనకి కావల్సిన ఎనర్జీ ఇదే అని అన్నారు. అదే ‘ఓడియమ్మ’ సాంగ్‌. దీన్ని ధ్రువ్‌తో పాడించాలనే ఆలోచన కూడా దర్శకుడిదే. అలాగే శ్రుతీహసన్‌ కూడా అద్భుతంగా పాడారు.

  • వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వండర్‌ఫుల్‌ ప్రొడక్షన్‌ హౌస్‌. ఈ సినిమా కోసం 15 మంది మ్యూజీషియన్లు దాదాపు 40 రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి పని చేశారు. మరో 20 మందికి పైగా ప్లేయర్స్‌ రికార్డింగ్స్‌లో పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుంగా ఈ సినిమాను నిర్మించారు.

  • నా కొత్త చిత్రాల విషయానికి వస్తే రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికీ, శర్వానంద్‌, శ్రీరామ్‌ ఆదిత్య చిత్రానికి పని చేస్తున్నా.

Updated Date - 2023-12-06T05:13:59+05:30 IST