స్పార్క్ లాంటి చిత్రం
ABN , First Publish Date - 2023-10-15T04:03:48+05:30 IST
విక్రాంత్, మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎ్‌ఫ.ఈ’. హై బడ్జెట్‌తో సాంకేతిక హంగులతో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. నాజర్, సుహాసినీ మణిరత్నం, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ప్రధాన తారాగణం...

విక్రాంత్, మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎ్‌ఫ.ఈ’. హై బడ్జెట్‌తో సాంకేతిక హంగులతో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. నాజర్, సుహాసినీ మణిరత్నం, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ప్రధాన తారాగణం. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ ‘‘స్పార్క్’ చిత్రం నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా అంశాలు ఉన్నాయి’ అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ ‘‘స్పార్క్’ చిత్రం టైటిల్‌కు తగ్గట్లు స్పార్క్‌లా ఉంటుంది. విక్రాంత్, గురు సోమసుందరం ఈ సినిమాతో తొలిసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. మా నిర్మాత లీల గారి సహకారం వల్లే ఇంత మంచి సినిమా తీయగలిగాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు.