గ్యాంగ్‌స్టర్‌తో ఇమ్రాన్ హష్మీ
ABN , First Publish Date - 2023-06-16T02:10:40+05:30 IST
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). సుజిత్ దర్శకుడు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్...

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). సుజిత్ దర్శకుడు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించింది. బాలీవుడ్‌లో ముద్దుల వీరుడిగా పేరు తెచ్చుకొన్న ఇమ్రాన్.. ఓ దక్షిణాది చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ప్రియాంకా మోహన్ కథానాయిక. తమన్ స్వరాలు అందిస్తున్నారు. మరో పాత్రలో తమిళ నటి శ్రియా రెడ్డిని ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ‘సాహో’ తరవాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. త్వరలోనే ఓ కొత్త షెడ్యూల్‌కి శ్రీకారం చుడతారు.