Spark LIFE: ఈ సినిమా చేసే క్రమంలో మంచిని, చెడుని చూశానంటోన్న హీరో!
ABN , First Publish Date - 2023-08-03T21:34:05+05:30 IST
విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
విక్రాంత్ (Vikranth), మెహరీన్ పిర్జాదా (Mehreen Pirzada), రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరో హీరోయిన్లుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’ (Spark LIFE). యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకహీరో విక్రాంత్ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..
‘‘నేను సినిమా లవర్‌గా ‘స్పార్క్’ సినిమాను స్టార్ట్ చేశాను. ఈ సినిమా ప్రారంభ వేడుకకు అశ్వినీదత్‌గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన చేత్తో లాంచ్ చేసిన ఏ హీరో అయినా సూపర్ స్టారే. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని గారికి థాంక్స్. ఇంకా ఇప్పటి వరకు సపోర్ట్ అందించిన అందరికీ థ్యాంక్స్. నేను చిన్నప్పటి నుంచి సినిమాలను చాలా ఎక్కువగా ఇష్టపడేవాడిని. నాన్నకు ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువగా అవుతుండేవి. ఎక్కడకు వెళ్లినా దగ్గరగా ఏ థియేటర్ ఉంది.. ఏ సినిమాను చూడాలి అని ఆలోచనతో ఉండే వాడిని. యు.ఎస్ వెళ్లి చదువుకుని జాజ్ చేసినప్పటికీ సినిమాపై ప్రేమ పెరిగిందే కానీ, తగ్గలేదు. ఆ ప్రేమతోనే రెండేళ్ల పాటు కష్టపడి ‘స్పార్క్’ సినిమా కథను డెవలప్ చేసుకున్నాను. ఈ జర్నీలో మా డెఫ్ ఫ్రాగ్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా చేసే క్రమంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ప్రయాణించాం. (Spark Teaser Launch Event)
మా సినిమాలో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్స్ మెహరీన్, రుక్సార్ థిల్లన్.. ఇద్దరూ అద్భుతంగా నటించారు. గురు సోమసుందరం పోషించిన పాత్ర చాలా ఏళ్ల పాటు గుర్తుండిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సుహాసినిగారు కీలక పాత్రలో నటించారు. నాజర్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర, చమ్మక్ చంద్ర, అషూ రెడ్డి.. ఇలా అందరూ ఎంతో బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ అద్భుతం అనేలా సంగీతాన్నిచ్చారు. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో నెక్ట్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ‘హృదయం’ సినిమా చూడగానే ఆయనే నా మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయాను. ‘స్పార్క్’ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన సంగీతానికి అనంత శ్రీరామ్‌గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. అశోక్ కుమార్‌గారు వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. మా ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్, కో డైరెక్టర్ స్వామిగారు, రైటర్స్ ఉమర్ జీ అనురాధ అందరూ బెస్ట్ మూవీ చేయాలని కష్టపడ్డారు. నేను ఎంత ప్రేమతో అయితే ఈ సినిమా చేశానో అదే ప్రేమను ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నాను’’ అని హీరో విక్రాంత్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sushanth: మెగాస్టార్‌తో ‘భోళా శంకర్’ సినిమాలో చేస్తున్నానని.. చినమామయ్యకి చెప్పా..
**************************************
*Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు
**************************************
*Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!
**************************************
*Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?
**************************************
*Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే
**************************************
*VK Naresh: కోర్టులో నరేష్‌కి ఊరట.. రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం
********************************************