Adipurush - Dipika Chikhlia :తిరుమల ఘటనపై అప్పటి సీత ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-06-09T15:44:53+05:30 IST

'ఆదిపురుష్‌’ - తిరుమల ఘటనపై మరో సీనియర్‌ నటి కామెంట్‌ చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ ఓంరౌత్‌ అక్కడి నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్‌ కృతీ సనన్‌ను హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘రామాయణ్‌’ (సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిక్లియా స్పందించారు.

Adipurush - Dipika Chikhlia :తిరుమల ఘటనపై అప్పటి సీత ఏమన్నారంటే..

'ఆదిపురుష్‌’ (Adipurush) - తిరుమల ఘటనపై మరో సీనియర్‌ నటి కామెంట్‌ చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ ఓంరౌత్‌ (Om raut) అక్కడి నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్‌ కృతీ సనన్‌ను హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవిత్ర పుణ్య క్షేత్రంలో దర్శకుడు హద్దు మీరి ప్రవర్తించాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు, హిందూ సంఘాలు. తాజాగా ఈ వివాదంపై సీనియర్‌ నటి, రామానంద్‌ సాగర్‌ డైరెక్ట్‌ చేసిన ‘రామాయణ్‌’ (Ramayan) సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిక్లియా (Dipika Chikhlia) స్పందించారు. దర్శకుడి తీరుపై మండిపడ్డారు.

సీత.. అంటే పాత్రలాగే చూస్తున్నారు..

‘‘ఈతరం నటీనటులతో వచ్చిన సమస్య ఇదే. మనం ఎలాంటి పాత్ర పోషిస్తున్నాం.. దాని విలువ ఏంటి? ఆర్టిస్ట్‌గా అందులో ఎంతగా లీనమైపోవాలి అన్నది తెలుసుకోవడం లేదు. ఆ పాత్రలో ఉన్న ఎమోషన్స్‌ గురించి కూడా పట్టించుకోరు. ‘రామాయణం’ అంటే వాళ్లకు ఓ సినిమా మాత్రమే! అందులో ఉన్న ఆధ్యాత్మికకు వారు కనెక్ట్‌ కాలేదు. కృతీసనన్‌ ఈతరం అమ్మాయి కాబట్టి.. ఒకరు ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం ఓ స్వీట్‌ మెమరీ అనుకుంటారు. అదొక కొత్త సాంప్రదాయంగా ఈతరం వాళ్లు భావిస్తారు. కృతీసనన్‌ ‘ఆదిపురుష్‌’లో సీత పాత్ర చేసినా తానని తాను సీతగా భావించలేదు. గతంలో నేను కూడా గతంలో సీత పాత్ర చేశాను. నాకు దక్కిన మహాభాగ్యం అది. ఆ పాత్రలో జీవించి తరించిపోయాను. ఇప్పటి తరం వాళ్లు కేవలం వాటిని ఒక పాత్రలాగే చూస్తున్నారు. సినిమా అయిపోయాక దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు. ఆ పాత్ర అయిపోయిందిగా అని అనుకుంటారు.

1.jpg

కాళ్లకు నమస్కరించేవారు...

మేం ఈ తరహా పాత్రలు చేసినప్పుడు సినారియో ఇలా ఉండేది కాదు. సెట్‌లో ఎవరూ కూడా మా పేరు పెట్టి కూడా పిలిచే ధైర్యం చేసేవారు కాదు. ఆ పాత్రల్లో ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చి మా కాళ్లకు నమస్కరించేవారు. మమ్మల్ని నటులుగా కాకుండా దేవుళ్లలాగే భావించేవారు. పైనున్న భగవంతుడే ఈ లోకంలోకి వచ్చారన్నంతగా మమ్మల్ని భక్తిపారవశ్యంతో చూేసవారు. అందుకే ప్రజలు మనసును నొప్పించే పనులు మేమెప్పుడూ చేసే వాళ్లం కాదు. హగ్గులకు,, ముద్దులకు ఆస్కారమే ఉండేది కాదు. ‘ఆదిపురుష్‌’ విడుదల కాగానే ఇందులో పని చేసిన వాళ్లంతా ఈ సినిమాను మర్చిపోయి మరో ప్రాజెక్ట్‌లో బిజీ అవుతారు. కానీ మా కాలంలో ఇది పూర్తి విరుద్థంగా ఉండేది. ఇప్పటికీ మా మదిలో ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి’’ అని దీపికా పేర్కొన్నారు.

ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్‌ సీతగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓం రౌత్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మించిన చిత్రమిది.

Untitled-1.jpg

Updated Date - 2023-06-09T15:46:22+05:30 IST