Dil Raju - OTT : చిన్న సినిమాల కోసమేనా? టీమ్‌ ఏం చెప్పారంటే!

ABN , First Publish Date - 2023-11-06T14:19:27+05:30 IST

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌ రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది కొంతకాలంగా ఆయన ఓటీటీని ప్రారంభించబోతున్నారని, చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకురాబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Dil Raju - OTT : చిన్న సినిమాల కోసమేనా? టీమ్‌ ఏం చెప్పారంటే!

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌ రాజు (Dil Raju) ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది (OTT Business) కొంతకాలంగా ఆయన ఓటీటీని ప్రారంభించబోతున్నారని, చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకురాబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను దిల్‌ నిర్మాణ సంస్థ ఖండించింది. నిజాలు తెలియకుండా అలాంటి వార్తలను సర్క్యులేట్‌ చేయవద్దని సోషల్‌ మీడియా వేదికగా కోరింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు.

‘‘మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్థారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. రూ.5కోట్లలోపు బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ఆలోచనలో దిల్‌ రాజు ఉన్నారని కొద్దిరోజులుగా టాక్‌ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ ఓటీటీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే దిల్‌ రాజు టీమ్‌ స్పందించింది. ప్రస్తుతం దిల్‌ రాజు నిర్మాణ సంస్థ నుంచి రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంతో తెరకెక్కుతోంది. అలాగే విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబోలో 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రం రూపొందుతోంది.

Updated Date - 2023-11-06T14:29:59+05:30 IST